రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి కంటే ప్రతిపక్షాలపై విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు
మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి నవంబర్ :21
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి కంటే ప్రతిపక్షాలపై విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. సిద్దిపేట సభలో ప్రజాసమస్యలు, అభివృద్ధి, నిధుల కేటాయింపులపై మాట్లాడకుండా హరీష్ రావు, కేసీఆర్‌లను దూషించడానికే సమయం కేటాయించారని ఆరోపించారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రసంగంలో సౌండ్ ఎక్కువ.. సొల్యూషన్ తక్కువగా ఉందని ఎద్దేవా చేశారు.
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి భాష, వ్యవహారశైలి మార్చుకోవాలని, మూడేళ్ల పాలనలో అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డికి నిధులు కేటాయించకుండా హడావుడి చేసి వెళ్లిపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని నాయకులు హెచ్చరించారు

