📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణతొలిముద్ద ను సద్వినియోగపరచాలి: సర్పంచి

తొలిముద్ద ను సద్వినియోగపరచాలి: సర్పంచి

📰 Generate e-Paper Clip

తొలిముద్ద ను సద్వినియోగపరచాలి: సర్పంచి
పప్రజావాణి, నెల్లికుదురు : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తొలిముద్దకార్యక్రమాన్ని సద్వినియోగ పరచాలని సర్పంచి గుండె పోయిన ఉష అశోక్ అన్నారు.మండలంలోని ఎర్రబెల్లి గూడెంలో ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రం లో సర్పంచి ఉష అశోక్ శనివారం సూపర్వైజర్ జలగం సునీత తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి,సూపర్వైజర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లోని 3 సం.ల నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులకు
పౌష్టికాహారంతో కూడిన ఉదయపు అల్పాహారం అందించడానికి తొలిముద్ద కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు.చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడం,అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లల హాజరు శాతాన్ని పెంచడం ఈ పథకం లక్ష్యం అన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.జీ కార్యక్రమంలో ఉపసర్పంచి సాంబమూర్తి వార్డ్ సభ్యులు,పాఠశాల ఉపాధ్యాయులు,ఆశా వర్కర్లు,అంగన్వాడీ టీచర్లు,హెల్పర్లు, తల్లులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.