📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఅర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

📰 Generate e-Paper Clip

అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం – గ్రామ సర్పంచ్ బైర మానస రాజేందర్

దాచారం గ్రామంలో అర్హులకు ఆసరా (చేయూత) పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ

బెజ్జంకి, నవంబర్ 17 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామ పంచాయతీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ బైర మానస రాజేందర్ ఆధ్వర్యంలో ఆసరా (చేయూత) నూతన పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గీత కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ బైర మానస రాజేందర్ మాట్లాడుతూ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఆసరా పెన్షన్లు, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంపు వంటి పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని,ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే తమ ప్రధాన లక్ష్యమని, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని సర్పంచ్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దీటి బాల్ నర్సు, వార్డు సభ్యులు గదాగోని అశోక్, నేతి మహేష్, కంగండ్ల సోని, బోడిగే సతీష్, కంగండ్ల చేద్రయ్య, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు పెంటమిది వెంకయ్య, రామస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాతంగి భాస్కర్, శ్రీకాంత్, రమేష్, మొండయ్య, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.