*మద్యం మత్తులో కన్నతల్లినే కడతేర్చిన అమానుష ఘటన..!*
*రోకలి బండతో తల పగలగొట్టి దారుణ హత్య..!*
*పెద్ద శంకరంపేట మండలం శివాయిపల్లిలో విషాదం.. గ్రామంలో తీవ్ర విషాదం..!*
*బెల్ట్ షాపులు బంద్ చేయాలని తీర్మానం చేసినా.. ఆగని మద్యం ఏరు..!*
*బెల్ట్ షాపులు బంద్ చేయాలని తీర్మానం చేసినా.. మద్యానికి బానిసై తల్లి ప్రాణం తీసిన కొడుకు..!*
*గ్రామమంతా శోకసంద్రం.. మద్యం మహమ్మారికి మరో బలి..!*
*మద్యం ఒక కుటుంబాన్ని నాశనం చేసింది..!*
*ఒక తల్లి ప్రాణం తీసింది..!*
*ఒక గ్రామాన్ని శోకంలో ముంచింది..!*
*పెద్ద శంకరంపేట: ప్రజావాణి న్యూస్ ప్రతినిధి బాలరాజు*
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం శివాయిపల్లిలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న దారుణ ఘటన మండల వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో కన్నతల్లినే కడతేర్చిన అమానుష ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కన్నతల్లిని కొడుకు చంపుతాడా అని గ్రామస్తులు నమ్మలేకపోతున్నారు. 73 ఏళ్ల వృద్ధురాలి ప్రాణం మద్యం మత్తులో బలైంది. ఒక కుటుంబం చిన్నాభిన్నమైంది. ఒక గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.
*అసలు ఏం జరిగింది..?*
శివాయిపల్లి గ్రామానికి చెందిన చిలుక ముక్కు పాపయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో తన తల్లి పద్మమ్మ (73) తలపై రోకలి బండతో బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కన్నకొడుకే కాలయముడిగా మారి తల్లిని పొట్టన పెట్టుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.16-11-2026 నాడు సాయంత్రం అందాజా ఆరు గంటల సమయంలో శివాయిపల్లి గ్రామంలో నిందితుడైన చిలకముక్కు పాపయ్య డబ్బుల విషయంలో తన తల్లి అయిన చిలకముక్కు పద్మమ్మ (73) తో మరియు అతని భార్యతో గొడవ పడ్డాడు. తనకు డబ్బుల సమస్య రావడానికి తన తల్లి పద్మమ్మే కారణమని భావించి, ఎలాగైనా ఆమెను ఈరోజు చంపాలనే క్రూరమైన ఉద్దేశంతో రోకలి బండ తీసుకొని పద్మమ్మ తలపై బలంగా కొట్టాడు.
దాడిలో పద్మమ్మ తలకు తీవ్రమైన రక్తస్రావమైంది. తల పగిలి రక్తం ఏరులై పారింది. అక్కడికక్కడే ఆమె కుప్పకూలిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే పద్మమ్మను చికిత్స కోసం 108 అంబులెన్స్ నందు నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి* తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టర్ పరిశీలించి పద్మమ్మ చనిపోయినట్లు నిర్ధారించడం జరిగింది. తల్లి చనిపోయిందన్న వార్త వినగానే కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ విలపించారు. గ్రామస్తులు కూడా కన్నీరు మున్నీరుగా విలపించారు.
*ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు..*
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి జోగిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించడం జరిగింది.
ఇట్టి విషయంపై మృతురాలు పద్మమ్మ యొక్క అక్క కొడుకు అయిన చిలకముక్కు కృష్ణ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పాపయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
*బెల్ట్ షాపులు బంద్ చేయాలని తీర్మానం చేసినా.. ఆగని మద్యం ఏరు..!*
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..బంద్ చేయాలని కొన్ని రోజుల క్రితమే గ్రామస్తులు తీర్మానం చేశారు. గ్రామ పెద్దల సమక్షంలోనే ఈ తీర్మానం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. అయినప్పటికీ మద్యానికి బానిసైన పాపయ్య సోమవారం రాత్రి మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు.
మద్యం మత్తులో కన్నతల్లినే దాడి చేయడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మద్యం వల్లే కుటుంబాలు నాశనమవుతున్నాయని, భార్యా భర్తల మధ్య గొడవలు, తల్లిదండ్రులతో గొడవలు, అప్పుల బాధలు.. అన్నింటికీ మద్యమే కారణమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బెల్ట్ షాపులు ఉంటే ఇలాంటి ఘోరాలు మళ్ళీ మళ్ళీ జరుగుతాయి. మద్యం మత్తులో కన్నతల్లిని చంపే స్థితికి వచ్చాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి. వెంటనే గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా బంద్ చేయాలి. మద్యం మహమ్మారిని గ్రామం నుంచి తరిమికొట్టాలి అని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
*పెద్ద శంకరంపేట మండల గ్రామస్తుల డిమాండ్..*
ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర విచారం వ్యక్తమవుతోంది. మద్యం వల్లనే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని, గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా బంద్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కన్నతల్లినే చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటన మళ్ళీ జరగకూడదంటే బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ ఘటన శివాయిపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మద్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైందని, ఇకనైనా అధికారులు మేల్కోవాలని ప్రజలు కోరుతున్నారు.

