ఇనుగుర్తిలో చేయూత ప్రారంభించిన ఎమ్మెల్యే..
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు..
ఇనుగుర్తిని సుందరంగా చేసుకుందాం..
త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయిస్తా..
ఎమ్మెల్యే డా.మురళి నాయక్
ప్రజావాణి,ఇనుగుర్తి: ఇనుగుర్తి మండల కేంద్రం లోని రైతు వేదికలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ మంగళవారం పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
స్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.
*ఇనుగుర్తి మండలానికి 334 పెన్షన్లు*
మండల కేంద్రం ఇనుగుర్తి తో పాటు వివిధ గ్రామాలకు చెందిన అర్హులకు నూతనంగా మంజూరైన 334 మంది లబ్ధిదారులకు పెన్షన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడుతూ తమ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తుందన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్ల తో పాటు అన్ని రకాల పథకాలను ఇస్తున్నట్లు తెలిపారు.
*ఇంటిగ్రేటెడ్ స్కూల్,డివైడర్లు ఏర్పాటుకు కృషి..*
మండల కేంద్రం ఇనుగుర్తిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు,త్వరలోనే మంజూరి చేయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మండల కేంద్రాన్ని సుందరంగా రూపొందించుకోవడానికి డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటుకు ఇనుగుర్తి పట్టణవాసులు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.అభివృద్ధిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.కార్యక్రమంలో తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు, స్పెషల్ ఆఫీసర్ డిఆర్డిఏ జిల్లా అడిషనల్ ఆఫీసర్ మల్లేశ్వరి,ఎంపీడీవో బండారు పార్థసారథి, మెడికలాఫీసర్ డా.సురేష్,దిశ సభ్యులు బాబురావు,ఏఎంసి డైరెక్టర్ కొట్టం రాము, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్, సర్పంచులు,ఉప సర్పంచిలు,పంచాయతీ కార్యదర్శులు,వార్డు సభ్యులు, కాంగ్రెస్ జిల్లా మండల గ్రామ నాయకులు పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


