📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఅర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

📰 Generate e-Paper Clip

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..

లింగాల ఘనపూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, నెల్లుట్ల సర్పంచ్ నర్సింగ రామకృష్ణ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 17 (ప్రజావాణి): జిల్లా లోని లింగాల ఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామపంచాయతీ ఆవరణంలో నిర్వహించిన కార్యక్రమంలో 136 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్ల మంజూరు పత్రాలను లింగాల ఘనపూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, నెల్లుట్ల సర్పంచ్ నర్సింగ రామకృష్ణ అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో అర్హులైన వారికి నూతన పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పింఛన్ అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, వృద్ధాప్యంలో ఉన్నవారికి, జీవనోపాధికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక భరోసా అని అన్నారు. ప్రతి నెలా అందే పింఛన్ ద్వారా లబ్ధిదారులు తమ నిత్యావసర అవసరాలను తీర్చుకోవడంతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించేందుకు తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు.

నెల్లుట్లలో ఒకేసారి 136 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్లు మంజూరు చేయడం సంతోషకరమైన విషయమని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజల అవసరాలను గుర్తించి వారి సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని అన్నారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, పేదలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద కుటుంబాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.

నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులు తమకు పింఛన్లు మంజూరు కావడం ఎంతో ఆనందంగా ఉందని, ఆర్థికంగా ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేస్తూ, సర్పంచ్ నర్సింగ రామకృష్ణకు, ఎంపీడీఓ శివశంకర్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, వార్డు మెంబర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, నూతన పింఛన్ల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.