జూడో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీలకు విజయ సాధన విద్యార్థుల ఎంపిక
జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు.అర్హత
ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం నవంబర్ 14
పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం కూనవరం విజయ సాధన హైస్కూల్ విద్యార్థులు జూడో క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభను చాటి ఇద్దరు విద్యార్థులు గన్నవరం లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం పట్ల పాఠశాలలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
పాఠశాలకు చెందిన కట్టం తేజ అభినవ్ (-55 కేజీల విభాగం) మరియు శిరపు నిత్య వర్ధన్ రెడ్డి (+65 కేజీల విభాగం) జూడో సబ్‌జూనియర్ విభాగంలో తమ ప్రతిభను నిరూపించుకుని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డి. రాజని, ప్రధానోపాధ్యాయులు, PET పి. నాని మరియు పాఠశాల యాజమాన్యం విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం పాఠశాలకు గర్వకారణమని, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిచారు.
విద్యార్థుల విజయానికి సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు క్రీడా శిక్షకులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.

