ఎన్నికల అభ్యర్థి కోరితే వారికి ప్రత్యేక ఎస్కార్ట్ కల్పిస్తాం- ఎస్ఈసీ కీలక ప్రకటన
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 15
తాడేపల్లి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా కీలక ప్రకటన చేసారు. రెండో విడత మున్సిపల్, పంచాయితీ ఎన్నికల నిర్వహణ పైన సమీక్ష చేసారు.
పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఘటనల వేళ ఈ సారి కీలక నిర్ణయం ప్రకటించారు. ఇక నుంచి నామినేషన్ల సమర్పణకు ఎవరైనా ప్రత్యేక ఎస్కార్ట్ కావాలంటే కల్పిస్తామని హామీ ఇచ్చారు.
దాడి ముప్పు ఉందని ఎస్పీకి చెప్తే, అభ్యర్థులకు ప్రత్యేక భద్రత కల్పిస్తారని స్పష్టం చేసారు.
పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పైన ఎస్ఈసీ కీలక సమావేశం నిర్వహించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పల్నాడు నుంచి రాయలసీమ వరకు కొన్ని గొడవలు జరిగాయని పునేఠా చెప్పుకొచ్చారు.
సమస్యాత్మక 12 జిల్లాల ఎస్పీలతో ప్రత్యేకంగా మాట్లాడామని… పంచాయతీ ఎన్నికల సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు.
నామినేషన్ల సమర్పణకు ఎవరైనా ప్రత్యేక ఎస్కార్ట్ కావాలంటే కల్పిస్తామని… దాడి ముప్పు ఉందని ఎస్పీకి చెప్తే.. అభ్యర్థులకు ప్రత్యేక భద్రత కల్పిస్తారని హామీ ఇచ్చారు. గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగుతాయని వివరించారు.
శాంతిభద్రతలు బాగుంటేనే, ఎన్నికల ప్రక్రియ అంతా సజావుగా సాగుతుందని అభిప్రాయ పడ్డారు. పంచాయతీ ఎన్నికల సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించామని వెల్లడించారు.

