📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగుర్రంపోడ్ మండల కేంద్రంలోని లిటిల్ చాంపియన్స్ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

గుర్రంపోడ్ మండల కేంద్రంలోని లిటిల్ చాంపియన్స్ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

*గుర్రంపోడ్ మండల కేంద్రంలోని లిటిల్ చాంపియన్స్ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు*

*కరెస్పాండెంట్ పిల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

గుర్రంపోడ్ మండల కేంద్రంలోని లిటిల్ చాంపియన్స్ స్కూల్ లో కరస్పాండెంట్ పిల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలను రంగురంగుల బెలూన్లు, పూలతో అలంకరించారు. చిన్నారులు రంగురంగుల దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం విద్యార్థులు పాటలు, నృత్యాలు, ఆటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లలే దేశ భవిష్యత్తు అని, చిన్ననాటి నుంచే మంచి సంస్కారం, క్రమశిక్షణ, చదువుతో పాటు సాంస్కృతిక విలువలు నేర్పించాలని తెలిపారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ పిల్లి శ్రీనివాస్, డైరెక్టర్ రొండి వెంకన్న, ఇంచార్జిలు కడారి స్వామి, విజయ్ ఉపాధ్యాయులు బండారు ఉపేందర్, రాజు, సుధాకర్, నాగేంద్ర, పరిమళ, చంద్రకళ, అఖిల, షబానా, శిల్ప, సుబ్బి, సొనాలి, తపస్విని, నైసీ, నీలిమ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.