📄 ePaper
Epaper 2
Monday, November 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవిద్యార్థుల చదువుకు ఉపాధ్యాయుడి ఆర్థిక చేయూత

విద్యార్థుల చదువుకు ఉపాధ్యాయుడి ఆర్థిక చేయూత

📰 Generate e-Paper Clip

విద్యార్థుల చదువుకు ఉపాధ్యాయుడి ఆర్థిక చేయూత

ముగ్గురు ఇంటర్ విద్యార్థులకు రూ.6,600 సాయం..

సేవాభావాన్ని చాటుకున్న ఉపాధ్యాయులు బిగుళ్ల బాబు

బెజ్జంకి,నవంబర్ 2(ప్రజావాణి)

విద్యార్థుల విద్యాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలములోని ఎల్లంపల్లి గ్రామ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల, బెజ్జంకిలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న డా. బిగుళ్ల బాబు సేవాభావాన్ని చాటుకున్నారు.ఆర్థిక ఇబ్బందులతో చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా అవసరంలో ఉన్న విద్యార్థులకు పలుమార్లు ఆర్థిక సహాయం అందిస్తూ ఆదర్శంగానిలుస్తున్నారు.ఇందులో భాగంగా తాజాగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రోహిత్ వర్మ, గండ్ల కావ్య, భువనేశ్వరి అనే ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2,200 చొప్పున మొత్తం రూ.6,600 ఆర్థిక సహాయం అందించారు. రెండు జతల యూనిఫారాలు,స్టడీ మెటీరియల్ కొనుగోలు కోసం ఈ నగదును అందజేశారు.కళాశాల ప్రిన్సిపాల్ ఖలీదా షిరీన్, వైస్ ప్రిన్సిపాల్ జె. శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థులకు నగదును అందించారు. విద్యార్థుల విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, అవసరమైన వారికి నిరంతరం అండగా నిలుస్తున్న డా. బిగుళ్ల బాబును వారు అభినందించారు.విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.