ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి-పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్
బెజ్జంకి, నవంబర్ 2 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఏడు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ ఆదివారం ప్రారంభించారు.ముత్తన్నపేట,వీరాపూర్,తోటపల్లి, బెజ్జంకి క్రాసింగ్,గుగ్గిళ్ల, రేగులపల్లి,చిలాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని కోరారు. ప్రైవేట్ వ్యాపారులు,దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేసి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ డైరెక్టర్లు,మార్కెట్ కమిటీ పాలకవర్గం,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగాల శ్రీనివాస్,బెజ్జంకి మండల ఎస్సి సెల్ అధ్యక్షులు బోయిని ప్రశాంత్,నాయకులు,ఆయా గ్రామాల సర్పంచ్ లు, పాలక వర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

