📄 ePaper
Epaper 2
Monday, November 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపదేళ్ల ప్రేమ.. పెళ్లికి నిరాకరణ?

పదేళ్ల ప్రేమ.. పెళ్లికి నిరాకరణ?

📰 Generate e-Paper Clip

పదేళ్ల ప్రేమ.. పెళ్లికి నిరాకరణ?
న్యాయం చేయాలంటూ సర్పంచ్ ఇంటి ఎదుట యువతి ఆందోళన
దండేపల్లి, నవంబర్ 2 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ప్రేమ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గ్రామ సర్పంచ్ మంగిడి శంకరమ్మ కుమారుడు మగ్గిడి మనోహర్ గత పదేళ్లుగా తనను ప్రేమించి, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని అదే గ్రామానికి చెందిన ఉపరపు కిష్టయ్య కుమార్తె ఉపరపు అక్షర ఆరోపిస్తోంది.
పదేళ్లుగా ప్రేమ పేరుతో తనను నమ్మించి, ఇప్పుడు వివాహానికి నిరాకరించడంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ అక్షర సర్పంచ్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. తనను పెళ్లి చేసుకొని న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది.
ఈ ఘటన లింగాపూర్ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. పదేళ్లుగా కొనసాగిన ప్రేమ వ్యవహారం చివరకు ఆందోళనకు దారితీయడంతో స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. సంబంధిత అధికారులు ఈ వ్యవహారంపై స్పందించి, ఇరువర్గాల వాదనలు విని సమగ్రంగా విచారించి బాధిత యువతికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.