నీటి భద్రతే రైతుకు భరోసా.. శాలపల్లిలో ఫామ్ పాండ్ నిర్మాణం ప్రారంభం
వేలేరు, నవంబర్ 2:
హనుమకొండ జిల్లా వేలేరు మండలం శాలపల్లి గ్రామంలో VB-G RAM G పథకం కింద రెండవ ఫామ్ పాండ్ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ కూరపాటి అశోక్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రైతు అదర రాజయ్య విజ్ఞప్తి మేరకు పనులను వెంటనే చేపట్టారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఫామ్ పాండ్ల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకొని భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని, కరువు పరిస్థితుల్లో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. గ్రామంలోని ప్రతి రైతు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎర్రగొల్ల రమేష్, గ్రామ కార్యదర్శి విజయ్, FA సంపత్, మెట్లు హరిత తదితరులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

