*మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు*
ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 8
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.జన్మదిన వేడుకలను పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా జన్మదిన సంబరాలు నిర్వహించారు. అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ ప్రత్యేక సూచనల మేరకు అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ వేడుకలను అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా నాయకులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు.ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.జన్మదినాన్ని పురస్కరించుకొని నాయకులు, కార్యకర్తలు ఒకచోట చేరి తమ అభిమానాన్ని, పార్టీ పట్ల ఉన్న ఐక్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా నాయకులు గుర్తుచేసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత, పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు చేరువగా పాలన అందిస్తోందని వివరించారు.ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు,అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సూచనలు, మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వేడుకలు ఘనంగా, విజయవంతంగా ముగిశాయి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శఎనుముల రేవంత్ రెడ్డికి నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజలకు మరిన్ని సంవత్సరాలు సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

