ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకలు
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మిఠాయిలు పంపిణీ చేసిన సర్పంచ్ ఎర్రల జానకి-రాజు
బెజ్జంకి, నవంబర్ 8 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి గ్రామ సర్పంచ్ ఎర్రల జానకిరాజు దీపావళి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ లబ్ధిదారులకు మిఠాయిలు పంపిణీ చేసి, కాకరపువ్వొత్తులు కాల్చుతూ దీపావళి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రల జానకిరాజు మాట్లాడుతూ పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని, ప్రారంభించారని,ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలన్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆశయంఅభినందనీయమన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సహకారంతో గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా కృషి చేస్తామని తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమ సొంతింటి కలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ, వార్డు సభ్యులు బండిపెల్లి రమేష్, సొల్లు బాలయ్య, మాజీ సర్పంచ్ పులి శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పైడిపల్లి శంకర్, గర్రెపల్లి అంజయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు బొమ్మరవేణి సంతోష్, ముత్యం సాగర్ తదితరులు పాల్గొన్నారు.

