మేడ్చల్, నవంబర్ 9: ఆకలితో, దప్పికతో ఎవ్వరూ ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో శ్రీ పాద వల్లభ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున నిర్వహిస్తున్న మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం సోమవారం మేడ్చల్‌లోని ఏడు గుళ్ళు అమ్మవారి ఆలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు, పేదలు, వృద్ధులు, కూలీలు, బాటసారులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అన్నదానం మహాదానం అనే స్ఫూర్తితో ట్రస్టు సభ్యులు భక్తిశ్రద్ధలతో స్వయంగా అందరికీ ప్రేమతో అన్న ప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా శ్రీ పాద వల్లభ ట్రస్టు చైర్మన్ రమేష్ గుప్తా మాట్లాడుతూ, ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం అందించడమే తమ ట్రస్టు ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి నెల అమావాస్య రోజున మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని, ఈ పుణ్యకార్యంలో మరింత మంది భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి అరుణ శ్రీ, ఎం. లావణ్య, విజయలక్ష్మి, రాధిక, శేఖర్ పటేల్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల అమావాస్య రోజున ఇదే విధంగా మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుకు సాగుతామని శ్రీ పాద వల్లభ ట్రస్టు సభ్యులు తెలిపారు.
శ్రీ పాద వల్లభ ట్రస్టు ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ
RELATED ARTICLES

