📄 ePaper
Epaper 2
Friday, November 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణభూ గర్భ జలాలు కాపాడుకోవాలని కళాబృందం కళాజాతా

భూ గర్భ జలాలు కాపాడుకోవాలని కళాబృందం కళాజాతా

📰 Generate e-Paper Clip

భూ గర్భ జలాలు కాపాడుకోవాలని కళాబృందం కళాజాతా

రెబర్తీ గ్రామ సర్పంచ్ నీరాటి శ్రీనివాస్

మద్దూరు నవంబర్5, ప్రజా వాణి,

జిల్లా కలెక్టర్ మరియు పౌర సంబంధాల శాఖ అధికారి బుజ్జూరి రవి కుమార్ ఆదేశాల మేరకు రేబర్తి గ్రామంలో ఏలినో ప్రభావం, పారిశుద్ధ్యం, నీటి పొదుపుపై కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
రేబర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ నీరటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం కళాబృందం చేత గ్రామ ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఏలినో ప్రభావం వల్ల పంటలకు కలిగే నష్టాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అదేవిధంగా తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరంపై కళాబృందం సభ్యులు తమ ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రజలు తమ దైనందిన జీవితంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నీటి విలువను గుర్తించి ప్రతి నీటి బొట్టును పొదుపు చేయాలని, రైతులు ఏలినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బియ్యా రమేష్, వార్డు సభ్యులు అంకం సోమశేఖర్, ఎర్ర బచ్చల శ్రీకాంత్, జజ్జల స్రవంతి రాజు, గ్రామ ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ రైతులు, యువత తదితరులు పాల్గొన్నారు.గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల్లో సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సర్పంచ్ నీరటి శ్రీనివాస్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.