📄 ePaper
Epaper 2
Saturday, November 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్క్యాన్సర్ నివారణకు కీలక ముందడుగు.. బాలికలకు హెచ్‌పీవీ టీకాలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షణే...

క్యాన్సర్ నివారణకు కీలక ముందడుగు.. బాలికలకు హెచ్‌పీవీ టీకాలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షణే లక్ష్యంగా ప్రత్యేక టీకాల కార్యక్రమం Writing బెజ్జంకి, నవంబర్ 6 (ప్రజావాణి): బాలికల ఆరోగ్య సంరక్షణ, భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా బెజ్జంకి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం

📰 Generate e-Paper Clip

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షణే లక్ష్యంగా ప్రత్యేక టీకాల కార్యక్రమం

బెజ్జంకి, నవంబర్ 6 (ప్రజావాణి)

బాలికల ఆరోగ్య సంరక్షణ, భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా బెజ్జంకి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం హెచ్‌పీవీ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు.14–15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెచ్‌పీవీ టీకాలు అందజేశారు. బాలికల ఆరోగ్య పరిరక్షణలో ఈ టీకా కీలకమైనదని, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఇది ఒక ముఖ్యమైన రక్షణ చర్య అని వైద్యాధికారి డాక్టర్ మాధురి తెలిపారు.క్యాన్సర్ నివారణపై బాలికలు, తల్లిదండ్రుల్లో అవగాహన పెంపొందించడంతో పాటు అర్హులైన ప్రతి బాలిక టీకా పొందేలా చర్యలు చేపడుతున్నట్లు ఆరోగ్య సిబ్బంది పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ మాధురి, ఆరోగ్య సిబ్బంది పద్మ, ఆశా కార్యకర్త వెంకటలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేవతి, ఉపాధ్యాయురాలు రూపాతో పాటు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.