📄 ePaper
Epaper 2
Friday, November 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

📰 Generate e-Paper Clip

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

తిరుపతి, నవంబర్ 05 (ప్రజావాణి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం అత్యవసరమని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ అన్నారు.

సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా గురువారం తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో వాహనదారులు, కార్యాలయ సిబ్బందికి ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగించడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు మానవ ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని పేర్కొన్నారు.

ముఖ్యంగా ఒక్కసారి మాత్రమే ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత వస్తువులను వినియోగించాలని కోరారు. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, కప్పులు, ప్లేట్లు, స్ట్రాల వినియోగాన్ని తగ్గించాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా వేరు చేసి రీసైక్లింగ్‌కు అందించాలని సూచించారు.

ప్రభుత్వ కార్యాలయాల నుంచే పర్యావరణ పరిరక్షణకు ఆదర్శవంతమైన మార్పు ప్రారంభం కావాలని, ప్రతి ఉద్యోగి తన వ్యక్తిగత జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజంలోని ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. చిన్న చిన్న మార్పులే పెద్ద సామాజిక మార్పులకు పునాది అవుతాయని అన్నారు.

అనంతరం జిల్లా రవాణా శాఖ అధికారులు, సిబ్బంది ప్లాస్టిక్ రహిత పర్యావరణ నిర్మాణానికి కట్టుబడి ఉంటామని సామూహికంగా ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారి అతికానాజ్, స్వర్ణలత, పరిపాలన అధికారులు విజయ్ కుమార్, విజయ ప్రశాంతి, ఇతర అధికారులు, సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.