కోశాధికారిగా పురుషోత్తం అంజయ్య గౌడ్ ఎంపిక
బెజ్జంకి,నవంబర్ 7 (ప్రజావాణి)
సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామ గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం నూతన అధ్యక్షుడిగా బేగంపేట మాజీ సర్పంచ్ బుర్ర అంజయ్య గౌడ్‌ను, కోశాధికారిగా పురుషోత్తం అంజయ్య గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.అలాగే కార్యవర్గ సభ్యులుగా బుర్ర శ్రీనివాస్, బుర్ర బిక్షపతి, బుర్ర ప్రవీణ్, బుర్ర రవి, బుర్ర అంజయ్య, పురుషోత్తం లక్ష్మణ్, పురుషోత్తం ధనుర్బాన్, పురుషోత్తం శ్రీనివాస్ తదితరులను ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, గౌడ కులస్తుల అభ్యున్నతి కోసం అందరినీ కలుపుకొని ఐక్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని, సంఘంలో ఎలాంటి వివక్షకు తావులేకుండా ఐక్యత, సామరస్య వాతావరణాన్ని నెలకొల్పుతామని తెలిపారు.సభ్యులందరి సహకారంతో గ్రామంలో నిర్వహించే రేణుక ఎల్లమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక కృషి చేస్తామని నూతన కార్యవర్గం తెలిపారు.

