*బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం చేయాలి..*
*లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ఉద్యమకారుల వారసత్వ కుటుంబంగా గుర్తించాలి.*
*వారికి 250 గజాల ఇంటి స్థలంతో పాటు రూ. 25,000/- పెన్షన్ ఇవ్వాలి.*
*బి. ఫార్మసీ చదువుకున్న భార్య స్వప్నకు ప్రభుత్వ ఉద్యోగం అందించాలి.*
*తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్ డిమాండ్..*
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 06 (ప్రజావాణి):
జిల్లా లోని బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ శుక్రవారం పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. కుటుంబానికి ధైర్యం కల్పించింది.
ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ భార్య స్వప్న, తండ్రి రామస్వామి గౌడ్ ద్వారా లక్ష్మణ్ గౌడ్ మరణానికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
లక్ష్మణ్ గౌడ్ కు ఒక కూతురు 6వ తరగతి, కొడుకు 2వ తరగతి చదువుతున్నారు. ఉద్యమ సమయంలో పార్టీ కోసం, ఉద్యమం కోసం చేసిన ఖర్చుతో అప్పుల ఊబిలోకి నెట్టివేయబడ్డాడు. ఆ తరువాత ఎంత ప్రయత్నించినా ఆ అప్పు తీర్చలేక మానసిక వేదన అనుభవిస్తున్న క్రమంలో, తనకు ఉన్న భూమి పట్టా పాస్ బుక్ లు జిల్లా కలెక్టర్ కొట్టివేయడంతో మనసు విరిగి, ఒక్క ఉద్యమకారుడికే రక్షణ లేదు, గౌరవం లేదు అని భావించి, అర్ధాంతరంగా సూసైడ్ నోట్ రాసి తనువు చాలించాడని కుటుంబ సభ్యులు దుఃఖంతో తెలిపారన్నారు.
అనంతరం జనగామ జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్ పత్రికా, మీడియా సమావేశంలో మాట్లాడుతూ…
కొన్నే గ్రామం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఫామ్ హౌస్ కు కేవలం 22 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్నా, కనీసం ఉద్యమకారుడికి నివాళులు అర్పించడానికి రాకపోవడం, వారి పక్షాన కనీసం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కానీ, హరీష్ రావును కానీ పంపించకపోవడం ఉద్యమకారుల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని అన్నారు.
తెలంగాణ రావడానికి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన గుండెలు ఆగిపోతే, కనీస మానవ బాధ్యతను విస్మరించి అవమానించడం బీఆర్ఎస్ పార్టీ నిజస్వరూపాన్ని తెలియజేస్తుందని అన్నారు.
ఉద్యమకారుల పెట్టుబడి, చెమట, రక్తంతో నిర్మితమైన బీఆర్ఎస్ పార్టీ తక్షణం వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరూ అడగకుండానే 250 గజాల ఇంటి స్థలం మరియు రూ. 25,000/- పెన్షన్ ఇస్తామని ప్రకటించి 3 సంవత్సరాలు కావస్తున్నా నేటికీ కార్యరూపం దాల్చకపోవడం వల్ల ఉద్యమకారులలో నైరాశ్యం పెరిగి ఆత్మహత్యలు లేదా అనారోగ్య చావులకు దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
*ఈ సందర్బంగా ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక
విజ్ఞప్తి:
*1.* లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ఉద్యమకారుల వారసత్వ కుటుంబంగా గుర్తించాలి.
*2.* వారికి 250 గజాల ఇంటి స్థలంతో పాటు రూ. 25,000/- పెన్షన్ ఇవ్వాలి.
*3.* బి. ఫార్మసీ చదువుకున్న భార్య స్వప్నకు ప్రభుత్వ ఉద్యోగం అందించాలి.
ఈ డిమాండ్ల సాధన లక్ష్యంగా నవంబర్ 13, 14, 15 తేదీల్లో హన్మకొండ జిల్లా కేంద్రంగా ఓదార్పు యాత్ర కొనసాగుతుందని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో
తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక జనగామ జిల్లా అధ్యక్షులు బొల్లపెల్లి శ్రీనివాస్, పాలకుర్తి మండల ప్రెసిడెంట్ ఎం.డి. నాసర్, దేవరుప్పుల మండల అధ్యక్షుడు రెడ్డిరాజుల రమేష్, జనగామ జిల్లా నాయకులు జేరిపోతుల సాయిలు, కూతటి నర్సింహులు, కొత్త జలేంధర్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షులు బొల్లిశెట్టి అశోక్, ములుగు జిల్లా అధ్యక్షులు రెండ్ల సంతోష్, వెంకటేశ్వర్లు, నాయకులు ఓడపెల్లి శ్యాం కృష్ణ, అనుముల రమేష్, దాసరి జనార్దన్, సుంచు వెంకన్న, టి.ఎన్. స్వామి, రామ్ బ్రహ్మచారి, రాజమౌళి, దేవేందర్ రెడ్డి, పోగుల కిరణ్, ఎర్రం మనోహర్, ఖదీర్, మాధవీ లత, స్వర్ణ లత, పద్మ, కేదాల ప్రసాద్, జీనుకల లక్ష్మణ్, మనోహర్, బంక కుమార స్వామి, మేకల కృష్ణ, మేకల రవీందర్, జగదీశ్ తదితర దాదాపు 50 మంది ఉద్యమకారులు పాల్గొన్నారు.



