నూతన వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ను కలిసిన డీఎంహెచ్‌వో డాక్టర్ కె.
ఆనంద్
మేడ్చల్, నవంబర్ 5: తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నూతన డైరెక్టర్/కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.డి. ముషారఫ్ అలీ ఫారూఖీ, ఐఏఎస్‌ను మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ కె. ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ కార్యాలయంలో డాక్టర్ కె. ఆనంద్ నూతన కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్/కమిషనర్‌గా నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు, భవిష్యత్తులో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చించినట్లు తెలిసింది. నూతన కమిషనర్ ఎం.డి.ముషారఫ్ అలీ ఫారూఖీ నాయకత్వంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగం మరింత అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు నాణ్యమైన, సత్వర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని డాక్టర్ కె.ఆనంద్ ఆశాభావం వ్యక్తం చేశారు.

