📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబడుగు, బలహీన వర్గాల హక్కుల సాధనకు కృషి చేస్తా

బడుగు, బలహీన వర్గాల హక్కుల సాధనకు కృషి చేస్తా

📰 Generate e-Paper Clip

బడుగు, బలహీన వర్గాల హక్కుల సాధనకు కృషి చేస్తా

తెలంగాణ రక్షణ సేన జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఉస్తేం శ్రీనివాస్

ఉస్తేం శ్రీనివాస్ నియామకంపై హర్షం.. ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో ఘన సన్మానం

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 07

బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు తన గొంతుకగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఉస్తేం శ్రీనివాస్ స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ రక్షణ సేన జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా ఉస్తేం శ్రీనివాస్‌ను నియమిస్తూ హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ నాయకత్వం సూచించింది.

ఈ నియామకం పట్ల ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉస్తేం శ్రీనివాస్‌ను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ.. ఉస్తేం శ్రీనివాస్ గత 35 సంవత్సరాలుగా ప్రజాసేవ, జాతి అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ముదిరాజ్ జాతి బిడ్డల సమస్యల పరిష్కారం కోసం, మత్స్యకార సహకార సంఘాల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న ఆయన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఆయనకు లభించిన ఈ బాధ్యత ముదిరాజ్ సామాజిక వర్గంతో పాటు బీసీ వర్గాల అభ్యున్నతికి మరింత దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అనంతరం ఉస్తేం శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి పెద్దపల్లి జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా నియమించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు, ఈ నియామకానికి సహకరించిన పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రామకోటికి, రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

సంస్థ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రతి పల్లెకు తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం కల్పిస్తానని తెలిపారు. పెద్దమ్మ తల్లి ఆశయాల వారసులుగా ముదిరాజ్ జాతి అభివృద్ధి కోసం నాయకులంతా ఐక్యంగా, నిబద్ధతతో, నూతన ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ సన్మాన కార్యక్రమంలో ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి, ముదిరాజ్ క్రమశిక్షణ పార్టీ చైర్మన్ కారుపాకాల రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కలవేన రవి, ముదిరాజ్ జిల్లా నాయకుడు కలవేన శ్రీనివాస్, మీడియా ఇన్‌చార్జి కలవేన రాము, ముత్తారం మండల అధ్యక్షుడు ఎర్రం లక్ష్మయ్య, ఈర్ల సదయ్య, సబ్బు తిరుపతి, కారుపాకాల రాజేందర్, జునువాలా శ్రీనివాస్, శంకరి తదితరులతో పాటు ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.