*కామ్రేడ్ పల్లాటి జగనన్న దశదిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన జేఏసీ నాయకులు*
*అధ్యక్షుడు కంబాలపల్లి భాస్కర్.*
రంగారెడ్డి జిల్లా నవంబర్ 7 (ప్రజావాణి) నోముల. గ్రామంలో కామ్రేడ్ పల్లాటి జగనన్న దశదిన కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం జేఏసీ నాయకులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం జేఏసీ అధ్యక్షులు కంబాలపల్లి భాస్కర్, ఉపాధ్యక్షులు పల్నాటి యాదయ్య, జేఏసీ నాయకులు కాళ్ల జంగయ్య, మంచాల మండల జేఏసీ ఉపాధ్యక్షులు ఏర్పుల శ్రీను, చదివేల కుమార్, ముత్యాల రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కామ్రేడ్ పల్లాటి జగనన్నకు నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

