📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగద్దర్ పాటకు నిలువెత్తురూపంజమ్మికుంటలో విగ్రహప్రతిష్ఠాపనకు శ్రీకారం

గద్దర్ పాటకు నిలువెత్తురూపంజమ్మికుంటలో విగ్రహప్రతిష్ఠాపనకు శ్రీకారం

📰 Generate e-Paper Clip

గద్దర్ .పాటకునిలువెత్తురూపంజమ్మికుంటలో విగ్రహప్రతిష్ఠాపనకు శ్రీకారం

* ప్రజా యుద్ధనౌక ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి కావాలి

* ఐక్యంగా ముందుకు సాగుదాం సన్నాహక సమావేశంలో వక్తల పిలుపు

జమ్మికుంట నవంబర్ 8 (ప్రజావాణి)

జమ్మికుంటప్రజా గాయకుడు ప్రజా యుద్ధనౌక గద్దర్ ఆశయాలను భావితరాలకు అందించాలనే సంకల్పంతో జమ్మికుంటలో ఆయన విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళా మండలి ఆధ్వర్యంలో ఆదివారం జమ్మికుంటలోని సహచర పిల్లల హాస్పిటల్ రెండో అంతస్తులో సన్నాహక సమావేశంనిర్వహించారుద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు రామంచ భరత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గద్దర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. విగ్రహ స్థాపనకు అనువైన స్థలం ఎంపిక అవసరమైన ఏర్పాట్లు తదుపరి కార్యాచరణపై అభిప్రాయాలు పంచుకున్నారుఈ సందర్భంగా ముఖ్యులు మాట్లాడుతూ గద్దర్ కేవలం ప్రజా గాయకుడే కాకుండా అణగారిన వర్గాల గొంతుకగా సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. తన ఆటపాటలతో ప్రజల్లో చైతన్యం నింపుతూ పేదలు కార్మికులు బడుగు బలహీన వర్గాల సమస్యలను సమాజం దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు ప్రజల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గద్దర్ సేవలను, ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు
జమ్మికుంటలో గద్దర్ విగ్రహ ప్రతిష్ఠాపన చేపట్టడం ద్వారా ఆయన ఆశయాలు, ప్రజా పోరాట స్ఫూర్తిని చిరస్థాయిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజా సంఘాలు, కళాకారులు సాహిత్య అభిమానులు ప్రజాస్వామిక వాదులు, గద్దర్ అభిమానులు పార్టీలకతీతంగా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారుఈ సమావేశంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య, తెలంగాణ వర్కర్స్ హమాలి యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుంటి సామ్రాజ్యం బీఎస్పీ హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు అంబాల ప్రభాకర్ (ప్రభు), డీటీఎఫ్ నాయకులు ఆవాల నరహరి, వేణు, బీసీ సంఘం నాయకులు దెబ్బట రవీందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాసాల రామస్వామి, టీఆర్ఎస్ నాయకురాలు ఆకినపల్లి శిరీష ప్రవీణ్, వల్లభాపూర్ సర్పంచ్ అందె కుమార్, ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మారముల్ల ఆనందం కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ గొల్లపల్లి శ్రీకాంత్ చల్లూరు మాజీ ఎంపీటీసీ ప్రముఖ కళాకారుడు తాండ్ర శంకర్, ప్రముఖ గాయకులు మిట్టపల్లి బాలు మంద జగన్, దాసరపు సమ్మయ్య, దాసరపు రాజు కాశి శివకుమార్ సంపత్ కుమార్ పల్లవి స్టూడియో అధినేత మారముల్ల ప్రభు కాంగ్రెస్ నాయకులు మారేపల్లి అజయ్, జర్నలిస్టులు కుమార్ యాదవ్, మహమ్మద్ నజీరుద్దీన్, సదానందం తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.