-రైతులకు అండగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR.
-ధాన్యం ధర క్వింటాల్‌కు రూ.3,500 తగ్గకుండా కొనుగోలు చేయాలి – రైస్ మిల్లర్లకు ఎమ్మెల్యే సూచన
-ప్రతి రైస్ మిల్లులో రూ.3,500 తగ్గకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం – రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రకటన
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 10
మిర్యాలగూడ నియోజకవర్గంలో ధాన్యం ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో వెంటనే స్పందించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు…
ఈ సమావేశంలో రైతులకు నష్టం కలగకుండా ధాన్యం క్వింటాల్‌కు రూ.3,500 తగ్గకుండా కొనుగోలు చేయాలని రైస్ మిల్లర్లకు ఎమ్మెల్యే BLR హెచ్చరించారు..
రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, రైతులు ఆర్థికంగా నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు…
అనంతరం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు MLA క్యాంప్ కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రతి రైస్ మిల్లులో ధాన్యం క్వింటాల్‌కు రూ.3,500*తగ్గకుండా కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు…
ధాన్యం నాణ్యత బాగుంటే రూ.3,500 కంటే ఎక్కువ ధర కూడా చెల్లిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ధర కంటే తగ్గించి కొనుగోలు చేయబోమని రైతులకు హామీ ఇచ్చారు…
రైతుల ఆందోళనను వెంటనే గుర్తించి, రైస్ మిల్లర్లతో చర్చించి రైతులకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR చొరవపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

