*ఆరుట్లలో ఘనంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాలు*
*ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చిన వెదిరె హన్మంత్ రెడ్డి, సర్పంచ్ మానిపాటి శోభాకుమార్*
మంచాల, నవంబర్ 9 (ప్రజావాణి):
మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల వద్దకు గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ కార్యదర్శి చిలుకల వెంకటేష్, డిప్యూటీ తహసీల్దార్ వినోద్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు లబ్ధిదారుల ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి, కుటుంబ సభ్యులను శాలువాలతో సన్మానించారు. అనంతరం బాణాసంచా కాల్చి పండుగ సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంచాల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెదిరె హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల కళ్లలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పేదరిక నిర్మూలనకు కృషి చేశారని తెలిపారు. అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇళ్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సహకారంతో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సర్పంచ్ మానిపాటి శోభాకుమార్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని, గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుంకరి పండరీనాథ్ గౌడ్, ఆనంగళ్ల యాదయ్య, మాజీ కోఆప్షన్ సభ్యుడు మహమ్మద్ సలాం, వార్డు సభ్యులు కొండిగారి శ్రావణ్ కుమార్, మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, లాలగారి మన్నెమ్మ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెరుకు నరసింహ గౌడ్, బుట్టి కృష్ణ ముదిరాజ్, కంబాలపల్లి బుగ్గరాములు, మార లక్ష్మణ్, కోరే బాబు, కావలి బుగ్గారాములు ముదిరాజ్, నూకం బాలరాజు ముదిరాజ్, చిందం శ్రీశైలం, గుడ్డిమల్ల చంద్రయ్య, మారగోని మాసయ్య గౌడ్, కావలి శ్రీనివాస్, మార సురేష్, చిందం ఐలయ్య, తవిటి యాదయ్య, దాసరమోని అశోక్, మహమ్మద్ అష్రఫ్, దూసరి రాజు గౌడ్, ఆడెపు మధు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నూకం రాయుడు ముదిరాజ్, రాజు, మద్దెల బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నేటి మాట – ప్రజావాణి
పేదల సొంతింటి కల నెరవేరిన వేళ వారి ఇళ్ల ముంగిట దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి.

