📄 ePaper
Epaper 2
Wednesday, November 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅభివృద్ధి పేరుతో నిబంధనల ఉల్లంఘనలు

అభివృద్ధి పేరుతో నిబంధనల ఉల్లంఘనలు

📰 Generate e-Paper Clip

అభివృద్ధి పేరుతో నిబంధనల ఉల్లంఘనలు

అసలే కరువు ఆపై.. కాలువలు పూడ్చి వేస్తే భవిష్యత్తు ఏంటో..?

బాణాపురం తండా–కమలాపురం రహదారి పనుల్లో కాలువ పూడ్చివేత

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం తండా నుంచి కమలాపురం వెళ్లే రహదారిని బీటీ రోడ్డు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రహదారి నిర్మాణం కోసం ఎన్‌ఎస్‌పీ కాలువను పూడ్చివేసి దాని మీదుగా రహదారి వేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.

కాలువను పూడ్చివేయడం వల్ల సాగునీటి ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఆయకట్టు రైతులకు సమస్యలు తలెత్తవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మాణం అవసరమే అయినప్పటికీ, సాగునీటి కాలువకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.

ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి, రహదారి నిర్మాణ పనులను పరిశీలించి ఎన్‌ఎస్‌పీ కాలువను పూడ్చివేయడం నిబంధనలకు అనుగుణంగా జరుగుతోందా? కాలువకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేశారా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. అసలే కరువు గంటలు మోగుతున్న వేళ అభివృద్ధి పనుల పేరుతో ప్రత్యామ్నాయ మార్గం చూపించకుండా చేస్తున్న అభివృద్ధిపై ప్రజలు రైతులు స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రహదారి నిర్మాణంతో ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడాలని, అదే సమయంలో రైతుల సాగునీటి హక్కులకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

*మరికొన్ని వివరాలతో.. అధికారుల స్పందన పై మరో కథనంలో.. వేచి చూడండి…!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.