📄 ePaper
Epaper 2
Wednesday, November 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకురేన్ ఘాట్ సినిమా పోస్టర్ ఆవిష్కరణ

కురేన్ ఘాట్ సినిమా పోస్టర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

*కురేన్ ఘాట్ సినిమా పోస్టర్ ఆవిష్కరణ*

* *మన ప్రజావాణి, మందమర్రి:-*

జిల్లాలోని దేవాపూర్ ప్రాంతంలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా చిత్రీకరించిన సినిమాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కళాకారులచే రూపొందించిన కురేన్ ఘాట్ సినిమా పోస్టర్ ను మంగళవారం పట్టణంలో ఆవిష్కరించారు. పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి, జిల్లా నృత్య కళా సమాఖ్య అధ్యక్షుడు రాకం సంతోష్ లు హాజరై, పోస్టర్ ను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు సినిమా నిర్మాణం చేయటం చాలా గొప్ప విషయమని, మన ప్రాంత వాసులు రూపొందించిన సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని, వారికి తమ వంతు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. ఈ సినిమాను జిల్లాకు చెందిన దొబ్బల శంకర్ నిర్మించగా దర్శకుడుగా దుర్గం విజయ్ దర్శకత్వం వహించారు. హీరో గా శ్రీమాన్, విలన్ గా తోట మహేష్ లు నటించగా, వేణు సంగీతం అందించారు. లక్కీ లక్ష్మణ్ కొరియోగ్రాఫర్ గా, రమేష్ రాజ ఫైట్ మాస్టర్ గా, కంపెల శ్రీనివాస్ మాటల రచయితగా వ్యవహరించారు. ఈ సినిమాని జిల్లావాసులు ఆదరించి సినిమాను హిట్ చేయాలని, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ ఇన్ ఫ్లూయెన్సర్ అనుదీప్, సీనియర్ డ్యాన్స్ మాస్టర్ రిథమ్ సది, నమ్రిత్, గౌరీష్, గిరి, యూత్ కాంగ్రెస్ నాయకులు ముడారపు శేఖర్ లు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.