📄 ePaper
Epaper 2
Saturday, October 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసొసైటీల ద్వారా లబ్ది పొందే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళల సహకారం అందిస్తుంది రేవూరి

సొసైటీల ద్వారా లబ్ది పొందే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళల సహకారం అందిస్తుంది రేవూరి

📰 Generate e-Paper Clip

సొసైటీల ద్వారా లబ్ది పొందే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళల సహకారం అందిస్తుంది రేవూరి

అక్టోబర్ 3 ప్రజావాణి/సంగెం

గోదాం ఓపెనింగ్ చేసిన కలెక్టర్ సత్య శారద

సహకార సంఘాల బలోపేతానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది

సంగెం మండలం రామచంద్రపురం గ్రామంలో ఎఫ్ ఎస్ సి ఎస్ కాపులకనపర్తి సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన 250 మెట్రిక్ టన్నుల ఎరువుల గోదాం మరియు షాపింగ్ కాంప్లెక్స్ ను జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాపులకానిపర్తి సొసైటీ అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సహకార సంఘాల బలోపేతానికి ప్రత్యేకంగా కృషి చేస్తోందని తెలిపారు.సహకార వ్యవస్థ ద్వారా రైతుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మరిన్ని అవకాశాలు లభిస్తాయని అన్నారు. సొసైటీ రైతులకు ప్రత్యేకంగా 1907 మందికి 14.77 కోట్ల రైతు రుణమాఫీ చేశామని అన్నారు.రైతుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న సహకార సంఘాలను బలోపేతం చేయడంతో పాటు, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.స్థానిక నాయకత్వం ఎంత బలంగా పనిచేస్తే, ప్రభుత్వం నుంచి అంతే స్థాయిలో ప్రోత్సాహం అందుతుందని అన్నారు.రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా ఈ గోదాం, సొసైటీ కార్యకలాపాలకు ఉపయోగపడేలా షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమని,సహకార సంఘాల ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తుందని, రాష్ట్రంలో ప్రధమంగా మహిళలతో పరకాల ఇందిరా మహిళా డైరీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రాజకుమార్. ఎంపీడీవో రవీందర్.డిసిఒ నీరజ, జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్, గ్రామ సర్పంచ్ పులి రమేష్ గౌడ్.సొసైటీ చైర్మన్ దొమ్మటి సంపత్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కందకట్ల నరహరి. రమేష్. గౌడ్. హరిబాబు.మండల పార్టీ అధ్యక్షులు ఇండ్ల రవికుమార్ మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి ఈవిధ గ్రామాల సర్పంచులు ఉపసర్పంచ్లు మహిళా సంఘాలు సొసైటీ ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.