📄 ePaper
Epaper 2
Saturday, October 3, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguనిబంధనలకు విరుద్ధంగా గాంధీ జయంతి రోజు బెల్ట్ షాప్ నిర్వహణ

నిబంధనలకు విరుద్ధంగా గాంధీ జయంతి రోజు బెల్ట్ షాప్ నిర్వహణ

📰 Generate e-Paper Clip

 

పస్రా/గోవిందరావుపేట, అక్టోబర్ 03, 2026 (మన సమగ్ర ప్రజావాణి):

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో బెల్ట్ షాప్ పై పోలీసులు దాడులు నిర్వహించారు.
గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినా నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
పస్రాలో కూల్ డ్రింక్ షాప్ ముసుగులో రాజు నాయక్ అనే వ్యక్తి అక్రమంగా మద్యాన్ని కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
నమ్మదగిన సమాచారంతో ఎస్సై ఎర్రయ్య, కానిస్టేబుల్ మధు తనిఖీలు చేపట్టారు.
తనిఖీల్లో వెళ రూపాయల విలువైన మద్యం పట్టుబడింది.
వెంటనే రాజు నాయక్ పై కేసు నమోదు చేసి, అక్రమ మద్యాన్ని సీజ్ చేశారు.
ఘటనపై సంబంధిత ఎక్సైజ్ అధికారులకు సమాచారం తెలియజేశారు.
గాంధీ జయంతి వంటి పవిత్రమైన రోజున కూడా అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.