📄 ePaper
Epaper 2
Saturday, October 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్పేదల సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం…

పేదల సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం…

📰 Generate e-Paper Clip

పేదల సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం… !

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం పేదల కష్టాలను గుర్తించి, వారి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం తల్లాడ మండలం పిన్నపాక గ్రామంలో మంత్రి 79 మంది లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి తో కలిసి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
గత ప్రభుత్వ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని రూ. 8,21,000 కోట్ల అప్పుల్లోకి నెట్టివేశారని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీగా నిధులు వృధా చేశారని విమర్శించారు. పేదవారికి ఇళ్లు ఇవ్వాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి రాలేదన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. ఇందులో ఇప్పటికే దాదాపు 2,25,000 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలినవి శరవేగంగా పూర్తవుతున్నాయని వివరించారు. రెండవ విడతలో మరో 2.5 లక్షల ఇళ్లను అందించడానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 

పిన్నపాక గ్రామంలో 79 మంది అర్హులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తున్నామని, వీటిలో ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఇతర సోదరీమణులు ఉన్నారని తెలిపారు.

డ్వాక్రా మహిళలకు రూ. 70,000 కోట్ల మేర సున్నా వడ్డీ రుణాలు అందించడం జరిగిందని, రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ అమలు చేయడంతో పాటు రైతు భరోసా, సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ అందిస్తున్నామన్నారు. ఉచిత విద్యుత్ (200 యూనిట్ల వరకు), రేషన్ కార్డుల పంపిణీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన వంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. రాబోయే రెండున్నర సంవత్సరాల పాలనలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని, పేదల సంక్షేమమే ప్రధాన అజెండాగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ
కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యంతోనే పేదల అభ్యున్నతి, సంక్షేమం సాధ్యమని అన్నారు. రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించి నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇళ్లను మంజూరు చేశారని తెలిపారు. పిన్నపాక గ్రామానికి మొదటి విడత కింద 25 ఇళ్లను కేటాయించి, ఒక్కో ఇంటికి రూ . 5 లక్షల సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.  స్థలాలు లేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలను గుర్తించి నేడు 79 మంది అర్హులకు ప్లాట్ల పట్టాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. 

మహిళలకు అత్యున్నత గౌరవం ఇస్తూ, డిజిటల్ రేషన్ కార్డులను కుటుంబ యజమానులైన మహిళల పేరిటే అందజేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, పినపాక గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.