📄 ePaper
Epaper 2
Saturday, October 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రమాదంలో గాయపడిన లింగ్యా నాయక్‌ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

ప్రమాదంలో గాయపడిన లింగ్యా నాయక్‌ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

ప్రమాదంలో గాయపడిన లింగ్యా నాయక్‌ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

నరసింహులపేట- ప్రజావాణి, అక్టోబర్ 3:

నరసింహులపేట మండలం పెద్ద నాగారం కొత్త తండాకు చెందిన లింగ్యా నాయక్ ఇటీవల ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ డి.ఎస్. రెడ్యానాయక్ శనివారం ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా లింగ్యా నాయక్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మాజీ ఎమ్మెల్యే వెంట వంతడుపుల మాజీ ఎంపీటీసీ అజ్మీరా నాయకి–లింగ్యా నాయక్, మాజీ వార్డు సభ్యులు అజ్మీర మల్సూర్, మలోత్ ఎలుము, బానోత్ సక్రూ, బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు బానోత్ లక్పతి, అజ్మీర తరుణ్, మంగీలాల్, టాక్య, మంగు తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా నాయకులు లింగ్యా నాయక్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.