📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణలక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి

లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

*లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి*

*రాయికల్, అక్టోబర్ 31 (ప్రజావాణి):*

రాయికల్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం అదనపు డిఆర్డీవో/డీపివో మదన్మోహన్ విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్స్ తో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు.ముందుగా జలసిరి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో మ్యాజిక్ సోక్ పిట్ల నిర్మాణానికి అనువైన ప్రదేశాలను గుర్తించడంలో జాప్యం జరగకుండా చూడాలని, ఇప్పటికే మంజూరైన సోక్ పిట్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన ఫామ్ పాండ్స్, బోర్వెల్ రీచార్జ్ నిర్మాణాలకు స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని, మంజూరైన పనులను నాణ్యతతో చేపట్టాలని స్పష్టం చేశారు.అనంతరం వీబీ-జీ రామ్ జీ ( ఉపాధి హామీ) పథకం అమలు తీరుపై సమీక్షించారు. కూలీల హాజరు శాతం తక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రతి గ్రామంలో గరిష్ట సంఖ్యలో కూలీలు పనులకు హాజరయ్యేలా అవగాహన కల్పించాలని, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్స్ క్షేత్రస్థాయిలో ప్రతిరోజూ పర్యవేక్షించాలని సూచించారు. పనుల కల్పనలో పారదర్శకత పాటించాలని తెలిపారు.ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ప్రతి ఇంటి నంబర్ కు మొబైల్ నంబర్ అనుసంధాన ప్రక్రియ పురోగతిపై ఆరా తీశారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధి నేరుగా లబ్ధిదారులకు చేరడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని, కాబట్టి ఈ కార్యక్రమాన్ని మండలంలో 100 శాతం పూర్తి చేసేలా కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.చివరగా గ్రామ పంచాయతీల పన్నుల డిమాండ్, వసూళ్లపై సమీక్షించారు. పలు పంచాయతీల్లో వసూళ్లు లక్ష్యానికి తగ్గట్టుగా లేకపోవడంపై స్పందిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను సాధించే విధంగా వసూళ్లను వేగవంతం చేయాలని, బకాయిల వసూళ్లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.మండల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, సంబంధిత సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా అదనపు డిఆర్డీవో ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో ఎంపిడివో బింగి చిరంజీవి,డీవీవో వకీల్,ఎంపివో మహేశ్వర్ రెడ్డి,ఏవీవో దేవేందర్ రెడ్డి, ఏపీవో దివ్య తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.