📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరక్తదాతలే ప్రాణదాతలు

రక్తదాతలే ప్రాణదాతలు

📰 Generate e-Paper Clip

రక్తదాతలే ప్రాణదాతలు!

15 యూనిట్ల రక్తదానం చేసిన చిన్నంబావి యువత

యువత సేవలను అభినందించిన ఎస్ఐ రామన్ గౌడ్

చిన్నంబావి, ప్రజావాణి:అక్టోబర్ 30

రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదాతలే నిజమైన ప్రాణదాతలని చిన్నంబావి ఎస్ఐ రామన్ గౌడ్ అన్నారు. సమాజ సేవలో యువత ముందుండాలని, రక్తదానం వంటి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
పోలీస్ అమరవీరుల స్మారకదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి పిలుపు మేరకు జిల్లా పోలీసు శాఖ, రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నంబావి మండల పరిధిలోని యువతకు ఎస్ఐ రామన్ గౌడ్ రక్తదానంపై అవగాహన కల్పించి, రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో స్పందించిన సుమారు 15 మంది యువకులు శిబిరంలో పాల్గొని 15 యూనిట్ల రక్తాన్ని దానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు.రక్తదానం చేసిన యువతకు పోలీస్ శాఖ, తెలంగాణ ప్రభుత్వ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో చొరవ చూపిన చిన్నంబావి ఎస్ఐ రామన్ గౌడ్‌తో పాటు యువతను జిల్లా ఎస్పీ సునీత రెడ్డిఅభినందించారు.ప్రజల సంక్షేమం, మెరుగైన సమాజ నిర్మాణం కోసం యువతీ యువకులు సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలని ఎస్ఐ రామన్ గౌడ్ కోరారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది మహేందర్, వంశీ, జర్నలిస్టులు పెరుమాళ్ల శ్రీనివాస్, పెరుమాళ్ల వెంకటేష్, యువకులు కనమోని శివ, మేకల అశోక్, జింకల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.