అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం.
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30 మార్కాపురం జిల్లా
మార్కాపురం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహణ.
జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆదేశాల మేరకు కార్యక్రమం.
ఆర్ఐ ఓ. రవికుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహణ.
పోలీస్ సిబ్బంది, విద్యార్థులు కలిపి 20 మంది స్వచ్ఛందంగా రక్తదానం.
అత్యవసర సమయాల్లో రక్తదానం ప్రాణదానంతో సమానమని సందేశం.
ఆరోగ్యవంతులందరూ స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని పిలుపు. అదేవిధంగా సమయంలో రక్తదానం ప్రతి ఒక్క మానవుడికి ఉపయోగం పడుతుందని తెలిపారు కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఆసక్తి కలిగిన వాళ్లు రక్తదానం ఇవ్వడంలో తప్పులేదు కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం కార్యక్రమంలో పాల్గొనాలని మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ రక్తదానం శిబిరంలో పాల్గొనాలని తెలియజేశారు.
కార్యక్రమంలో ఆర్ఎస్ఐ మాల్యాద్రి, కిట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అనిల్ కుమార్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు మరియు వివిధ గ్రామస్తులు పాల్గొన్నారు.

