📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్మేడ్చల్ డిపోలో నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

మేడ్చల్ డిపోలో నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

📰 Generate e-Paper Clip

*మేడ్చల్ డిపోలో నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం*

*ప్రయాణికుల సమస్యలు, ఫిర్యాదులకు నేరుగా పరిష్కారం పొందే అవకాశం*

మేడ్చల్ :- మేడ్చల్ ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే ఉద్దేశంతో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ పరిమళ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మేడ్చల్‌తో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు, ఆర్టీసీ ప్రయాణికులు బస్సు సౌకర్యాలకు సంబంధించిన తమ సమస్యలు, ఇబ్బందులు, సూచనలు, ఫిర్యాదులను నేరుగా డిపో మేనేజర్ దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా బస్సుల రాకపోకల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, సమయపాలన, వివిధ ప్రాంతాలకు బస్సు సౌకర్యాల కల్పన, ప్రయాణికులకు అందుతున్న సేవలకు సంబంధించిన అంశాలను తెలియజేయవచ్చని సూచించారు. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణికుల అవసరాలను గుర్తించి, వారికి మెరుగైన సేవలు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని డిపో మేనేజర్ తెలిపారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని, సాధ్యమైన మేరకు పరిష్కార చర్యలు చేపట్టేందుకు ఈ కార్యక్రమం ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. ఆర్టీసీ సేవలపై ప్రయాణికుల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకోవడం ద్వారా బస్సు సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మేడ్చల్ డిపో పరిధిలోని ప్రయాణికులు తమ సమస్యలను తెలియజేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఫిర్యాదులు, సూచనల కోసం ఫోన్ నంబర్: 9959226152
ప్రయాణికులు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య పై ఫోన్ నంబర్‌ను సంప్రదించి తమ సమస్యలు, సూచనలను డిపో మేనేజర్ దృష్టికి తీసుకురావాలని శ్రీమతి పరిమళ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.