📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ప్రజా సమస్యల పరిష్కారంలో ఆర్ఆర్ ఫౌండేషన్ ముందంజ శ్రీనివాస్ నగర్ కాలనీలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు

ప్రజా సమస్యల పరిష్కారంలో ఆర్ఆర్ ఫౌండేషన్ ముందంజ శ్రీనివాస్ నగర్ కాలనీలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు

📰 Generate e-Paper Clip

*ప్రజా సమస్యల పరిష్కారంలో ఆర్ఆర్ ఫౌండేషన్ ముందంజ
శ్రీనివాస్ నగర్ కాలనీలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు*

మేడ్చల్ అక్టోబర్ ప్రజావాణి:- ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆర్ఆర్ ఫౌండేషన్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతోందని ఫౌండేషన్ అధినేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామన్న గారి రాఘవేంద్ర గౌడ్ పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందించడమే ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మేడ్చల్ 297వ డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో స్థానికులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్య పరిష్కారానికి ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రత్యేక చొరవ తీసుకుంది. క్రీస్తు శేషులు వేలూరి ప్రమోద్ మాట ప్రకారం, ఆయన ఆశయాలకు అనుగుణంగా కాలనీలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించింది. కాలనీవాసులకు విద్యుత్ సౌకర్యం మెరుగుపడేలా చర్యలు చేపట్టి, నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయించినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా రామన్న గారి రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. శ్రీనివాస్ నగర్ కాలనీవాసుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు చొరవ తీసుకున్నామని, ఇచ్చిన మాట ప్రకారం పనులను పూర్తి చేయించామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రజలకు ఉపయోగపడే పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, రాబోయే రోజుల్లోనూ మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం, వారి సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీనివాస్ నగర్ కాలనీలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు పూర్తికావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్న ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత రామన్న గారి రాఘవేంద్ర గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని కాలనీవాసులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్, కటిక వినయ్, నరసింహారెడ్డి, రాహుల్‌తో పాటు శ్రీనివాస్ నగర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.