📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణతెలంగాణ ఉద్యమకారులకు ఇళ్లపట్టాలు ఇబ్రహీంపట్నం నుంచే శ్రీకారం

తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్లపట్టాలు ఇబ్రహీంపట్నం నుంచే శ్రీకారం

📰 Generate e-Paper Clip

*తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్లపట్టాలు ఇబ్రహీంపట్నం నుంచే శ్రీకారం…*
*జీవో వచ్చిన 24గంటల్లో స్థలాలు చూపించే బాధ్యత నాది…*
*ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి ….*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 27 (ప్రజావాణి): ఇబ్రహీంపట్నం :*తొర్రూర్‌లో తెలంగాణ ఉద్యమకారుల ‘అలయ్‌ బలయ్‌’…*
*కేసీఆర్ ఒక్కరు కాదు.. ఎందరో పోరాడితే రాష్ట్రం వచ్చిందన్న మల్‌రెడ్డి…*
*ఈ దఫా ఇళ్ల పట్టాలు… మళ్లీ గెలిచాక ఉద్యమకారులకు గృహనిర్మాణం….*
ఈ సారి 80వేల మెజార్టీతో గెలుస్తానన్న మల్‌రెడ్డి రంగారెడ్డి…*

హైలెవెల్ కమిటీ నిర్ణయం మేరకు జీవో వచ్చిన 24 గంటల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి గారు స్పష్టం చేశారు. అర్హులైన ఉద్యమకారులందరికీ వారు కోరిన చోట ఇంటిస్థలం చూపించే బాధ్యత తనదని చెప్పారు. తొర్రూర్‌లో మంగళవారం రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్‌రెడ్డి హాజరయ్యారు.

కేసీఆర్ ఒక్కరితోనే తెలంగాణ రాలేదని… ఎంతో మంది త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రం వచ్చినట్లు మల్‌రెడ్డి తెలిపారు. ఏ లక్ష్యంతోనైతే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందో… పదేళ్లలో అది నెరవేరకుండా, ఒక్క కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. కబ్జాలు, లంచాలతో కొందరు దోచుకొని, రాష్ట్రాన్ని మాత్రం ఆగం చేశారన్నారు. ఉద్యమలక్ష్యం నెరవేర్చేందుకే పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, సన్నబియ్యం పంపిణీలాంటి నిర్ణయాలు ప్రజాప్రభుత్వం తీసుకున్నట్లు చెప్పారు.

తెలంగాణ కోసం పోరాడిన వారికి పదేళ్లలో ఎలాంటి గుర్తింపు లభించలేదన్న మల్‌రెడ్డి… ఉద్యమకారులందరికీ ఇళ్లస్థలాలు పంపిణీ చేసేందుకే హైలెవెల్ కమిటీ వేసినట్లు చెప్పారు. జీవో వచ్చిన 24గంటల్లో నియోజకవర్గంలో ఉద్యమకారులకు స్థలాలు చూపించే బాధ్యత తనదని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్న మల్‌రెడ్డి రంగారెడ్డి… తాను 80 వేల మెజార్టీతో గెలువకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఈ దఫా ఇళ్లపట్టాలిస్తామని… మళ్లీ గెలిచాక ఉద్యమకారులందరికీ గృహాలు నిర్మించి ఇస్తామని చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.