📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగుండ్రాతిమడుగులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు

గుండ్రాతిమడుగులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

గుండ్రాతిమడుగులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు
పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి — గార్లపాటి భారద్వాజ్ రెడ్డి
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, అక్టోబర్ 27 ప్రజావాణి :
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించేందుకు కురవి మండలం గుండ్రాతిమడుగులో అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామంలో రామకృష్ణ అధ్యక్షతన, డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రునాయక్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కన్వీనర్ గార్లపాటి భారద్వాజ్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రులు తమ ఓటు హక్కును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఎన్నికల్లో పాల్గొని తమ బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాధాన్యత, ఓటరు నమోదు విధానం, ఓటింగ్ ప్రక్రియపై యువతకు, గ్రామస్తులకు వివరించారు. విద్యావంతులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయగలరని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (డాక్టర్స్ విభాగం) డాక్టర్ వీరన్న నాయక్, కురవి టౌన్ అధ్యక్షుడు రాజేందర్, కురవి ఎస్టీ సెల్ అధ్యక్షుడు గోపా నాయక్, మండల నాయకులు డాక్టర్ కరుణాకర్, వెంకటేష్, వినయ్, శ్రీను, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.