*ముదిరాజ్ సింహ గర్జన సభకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు ఘన ఆహ్వానం
* *మన ప్రజావాణి* మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 25న భారీ ఎత్తున నిర్వహించనున్న ముదిరాజ్ సింహ గర్జన సభకు ముదిరాజ్ సంఘం నాయకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లాలోని బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ని మర్యాదపూర్వకంగా కలిసి, సభకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈసందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి ని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ, ముదిరాజ్ ల ఐక్యతను, ఆత్మగౌరవాన్ని చాటేలా జరగనున్న ఈ సింహ గర్జన సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు గరిగంటి కొమురయ్య, రాష్ట్ర సీనియర్ కార్యదర్శి తండబోయిన శ్రీకాంత్, యువత జిల్లా అధ్యక్షుడు గరిగే సుమన్, నాయకులు మత్తమరి సతీష్ బాబు, నెల్లి రమేష్, సాధు శ్రీధర్, దాసరపు రాజు లు పాల్గొన్నారు..

