ఎంపీపీఎస్ కోరపల్లి పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ ఉత్సవాలు
* మండల విద్యాధికారిణి మంథని హేమలత
జమ్మికుంటఅక్టోబర్ 09 (ప్రజావాణి)
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లి ప్రభుత్వ పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు పండుగల విశిష్టతను తెలియజేయాలనే విశిష్ట ఉద్దేశంతో ఎంపీపీఎస్ కోరపల్లి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారుఈ కార్యక్రమానికి హాజరైన మండల విద్యాధికారిణి మంథని హేమలత మాట్లాడుతూ పాఠశాలలో ప్రతి కార్యక్రమాన్ని ప్రత్యేక ఆకర్షణగా మలచి నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులను ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగాఅభినందించారురాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎఫ్ ఎల్ ఎన్ (ఎఫ్ ఎల్ ఎన్) ప్రోగ్రాంలో భాగంగా రూపొందించిన స్టాండీని ఈ సందర్భంగా ప్రదర్శించడం చాలా సంతోషదాయకమని కొనియాడారుఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దబ్బేట రవీందర్ మాట్లాడుతూ సీనియర్ ఉపాధ్యాయులు గుడిమిల్ల బలరాం తన అద్భుత సృజనాత్మకతతో తయారు చేసిన ఎఫ్ ఎల్ ఎన్ స్టాండీ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. స్టాండీ రూపకల్పనలో సహకరించిన ఉపాధ్యాయినులు సంగసాని కుమారి, సైని శైలజ, గొర్ల రేఖలను ఆయన అభినందించారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. పూలను పేర్చడం ద్వారా పిల్లల్లో కళాత్మక నైపుణ్యాలు పర్యావరణంపై అవగాహన పెరుగుతాయని స్పష్టం చేశారు విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలసి కోలాటాలు నృత్యాలతో రోజంతా ఉత్సాహంగా గడిపారుఈ వేడుకల్లో సీఆర్పీ గుర్రప్ప అంగన్వాడీ టీచర్లు రమ భాగ్యరేఖలతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు

