📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపెద్ద పోచారంలో కనకదుర్గమ్మ ఆగమన ఊరేగింపు

పెద్ద పోచారంలో కనకదుర్గమ్మ ఆగమన ఊరేగింపు

📰 Generate e-Paper Clip

పెద్ద పోచారంలో కనకదుర్గమ్మ ఆగమన ఊరేగింపు ఘనంగా
డప్పుల మోతలు.. భక్తి గీతాలు.. మహిళల కోలాటాలతో పండుగ శోభ
కూసుమంచి( ప్రజావాణి ) అక్టోబర్ 9: మండల పరిధిలోని పెద్ద పోచారం గ్రామంలో శ్రీ కనకదుర్గ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి అమ్మవారి ఆగమన ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. డప్పుల సప్పుళ్లు, భక్తి గీతాల నడుమ అమ్మవారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా కోలాటాలు వేస్తూ అమ్మవారి ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ వీధులన్నీ భక్తి పారవశ్యంతో మార్మోగగా, ఎటుచూసినా పండుగ వాతావరణం నెలకొంది.
ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో స్వాగతం పలికారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.