📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో ఏఐ ఆధారిత ఎఫ్ఎల్ఎన్ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం

చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో ఏఐ ఆధారిత ఎఫ్ఎల్ఎన్ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం

📰 Generate e-Paper Clip

*చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో ఏఐ ఆధారిత ఎఫ్ఎల్ఎన్ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం*

చిలిపిచెడ్.అక్టోబర్ 9
ప్రజావాణి

చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో ఈ రోజు ఎఫ్ఎల్ఎన్ కృత్రిమ మేధ సహాయంతో భాష మరియు గణిత అభ్యాస కార్యక్రమం కొరకు కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల ప్రత్యేక అధికారి డిపిఎస్ఓ నిత్యానందం గారు మాట్లాడుతూ నూతన తరానికి అనుగుణంగా ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించడం హర్షణీయం అని తెలిపారు.

ఎంఈఓ విఠల్ గారు మాట్లాడుతూ అభ్యసన లోపాలు ఉన్న విద్యార్థులందరూ కృత్రిమ మేధ ఆధారిత కంప్యూటర్ అభ్యాసం ద్వారా ప్రగతి సాధించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చండూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రమేష్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి, సత్యనారాయణ, అనిత, ఉప సర్పంచ్ అఖిల్ గారు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పుష్పలత, గ్రామ కార్యదర్శి శోభారాణి, వార్డు మెంబర్ బాలమణి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.