📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమార్కాపురం రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక తనిఖీలు

మార్కాపురం రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక తనిఖీలు

📰 Generate e-Paper Clip

మార్కాపురం రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక తనిఖీలు

రైళ్లలో అక్రమ మద్యం, గంజాయి కోసం తనిఖీలు

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి మార్కాపురం జిల్లా అక్టోబర్ 27

మార్కాపురం జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, గంజాయి రవాణాను అరికట్టేందుకు సోమవారం మార్కాపురం రైల్వే స్టేషన్‌లో మార్కాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ (ఇన్‌చార్జి) కొండారెడ్డి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

విజయవాడ ఎస్‌టీఎఫ్, ఒంగోలు ఎన్‌ఫోర్స్‌మెంట్, మార్కాపురం ఈఎస్‌టీఎఫ్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఆర్‌పీఎఫ్ బృందాలు సంయుక్తంగా ప్రశాంతి, కొండవీడు, కాచిగూడ, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో తనిఖీలు చేపట్టాయి. ప్రయాణికులు, వారి సామగ్రిని పరిశీలించినా అక్రమ మద్యం, గంజాయి పట్టుబడలేదని అధికారులు తెలిపారు.

అక్రమ సరుకులు, పరిమితికి మించిన నగదు, మద్యం తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రయాణికులను మార్కాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ (ఇన్‌చార్జి) కొండారెడ్డి హెచ్చరించారు. అదేవిధంగా రక్షణ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.