📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలి

📰 Generate e-Paper Clip

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలి,
నర్సింహులపేట మండల కేంద్రంలో సమావేశం నిర్వహించిన మాజీ బీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత

ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ నర్సింహులపేట మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కవిత పాల్గొని పట్టభద్రుల ఓటరు నమోదు, ఎన్నికల్లో ఓటు హక్కు ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా పట్టభద్రులు ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు, ఎన్నికల సమయంలో బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని సమావేశంలో వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నరెసింహులపేట మాజీ సర్పంచ్ కల్సానీ దామోదర రెడ్డి మాట్లాడుతూ ఓటు యొక్క విలువను , దాని యొక్క ప్రాధాన్యతను , పట్టబద్రులకు, కార్యకర్తలకు వివరించారు. ఈ యొక్క సమావేశంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షులు మైదం దేవేందర్, మండల ప్రధాన కార్యదర్శి కుంభం సుదీర్ రెడ్డి, వంతడుపుల మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, వంతడుపుల సర్పంచ్ బాలు నాయక్. నర్సింహులపెట్ గ్రామ శాఖ అధ్యక్షులు కొండబత్తిని జగదీశ్వర్, సీనియర్
బీఆర్ఎస్ నాయకులు బండ భిక్షం రెడ్డి , నర్సింహులపెట్ మాజీ సర్పంచ్ కార్ల నాగన్న, మండల యూత్ అధ్యక్షులు బండి రమేష్ , దంతలపల్లి మాజీ సర్పంచ్ కిషోర్, కౌసల్యదేవిపల్లి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, రామన్న గూడెం సర్పంచ్.రమేష్ , వివిధ గ్రామాల వార్డు మెంబర్లు,ప్రజాప్రతినిధులు, నాయకులు, పట్టభద్రులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.