*మంచాల ఎంపీపీఎస్ విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగుల పంపిణీ*
*విద్యార్థుల విద్యాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల సహకారం అభినందనీయం*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 27 (ప్రజావాణి )మంచాల: హ్యాండ్స్ టుగెదర్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ మహేందర్ సార్ ఆధ్వర్యంలో మంగళవారం మంచాల ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు వారి విద్యాభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను అందజేశారు. విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రిని అందించడం ద్వారా చదువుపై ఆసక్తిని పెంపొందించవచ్చని, ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పలువురు పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యున్నతికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నోముల యూపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదయ్య సార్, మంచాల ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూబియానా మేడం, ఐరప్ యాదయ్య సార్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. విద్యార్థులకు సహకారం అందించిన హ్యాండ్స్ టుగెదర్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ మహేందర్‌కు ఉపాధ్యాయులు నర్ల బాషా. యాదయ్య.అభినందనలు తెలిపారు.

