📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపట్టభద్రుల ఎన్నికల్లో సమష్టిగా పని చేసి బి ఆర్ ఎస్ అభ్యర్థిని గెలిపించాలి తక్కెళ్లపల్లి...

పట్టభద్రుల ఎన్నికల్లో సమష్టిగా పని చేసి బి ఆర్ ఎస్ అభ్యర్థిని గెలిపించాలి తక్కెళ్లపల్లి రవీందర్రావు

📰 Generate e-Paper Clip

*పట్టభద్రుల ఎన్నికల్లో సమష్టిగా పని చేసి బి ఆర్ ఎస్ అభ్యర్థిని గెలిపించాలి తక్కెళ్లపల్లి రవీందర్రావు*

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో అశ్వారావుపేట మండల బి ఆర్ ఎస్ పార్టీ కోఆర్డినేటర్,మాజీ జడ్పీటీసీ జూపల్లి రమణ రావు ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ కు చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జీ తక్కెలపల్లి రవీంద్ర రావు,అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు.అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ ఉప్పల వెంకట రమణ వారి.ఈ సందర్భంగా వారికి రమణా రావు దంపతులు శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు.బ్రేక్ ఫాస్ట్ చేస్తూ సరదాగా అందరూ నాయకులతో ఆత్మీయంగా మాట్లాడుతూ, యోగ క్షేమాలనుఅడిగి తెలుసుకున్నారు, ఈ సందర్భంగా తక్కెలపల్లి రవీందర్రావు మాట్లాడుతూ,కెసిఆర్ కి మరియు మెచ్చా నాగేశ్వరరావు కి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు.తక్కువగా మాట్లాడి ఎక్కువగా పని చేసే నాయకుడు మెచ్చా నాగేశ్వరరావు అని.నియోజకవర్గ అభివృద్ధిని చూస్తే మెచ్చా నాగేశ్వరరావు. ఎంత కష్టపడ్డారో అర్థమవుతుందని. కెసిఆర్ వద్దకు సైలెంట్ గా వచ్చి ఏది అడిగినా వెంటనే కెసిఆర్. మంజూరు చేసి అప్పటికిఅప్పుడు ఆర్డర్ ని ఇచ్చి పంపించేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.మండలంలో బి ఆర్ ఎస్ పార్టీ బలోపేతం కోసం దిశ నిర్దేశం చేయడంతో పాటు ఎమ్మెల్సీ ఓట్ల ఎన్రోల్మెంట్ ప్రక్రియలో పార్టీ నాయకులు అందరూ పాల్గొని ప్రతి ఒక పట్టభద్రుడు తమ ఓటును ఎన్రోల్మెంట్ చేసుకునేవిధంగా సమన్వయంతో పని చెయ్యాలని.ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి.గెలుపుకోసం అందరూ కష్టపడి పని చెయ్యాలని పిలుపునిచ్చారు.
*సర్పంచ్లకు సన్మానం*
నినావత్ అనూషా దేవీ(అనంతారం),కుప్పాల మంగా(నారంవారిగూడెం కాలనీ),మనుగొండ నాగమణి(పాత నారంవారిగూడెం),బేతి భారతి(కేసప్పగూడెం), మద్దిన నర్సమ్మ(జమ్మిగూడెం), పండా రాజులు(దురదపాడు) సర్పంచ్లను ఘనంగా శాలువాలతో సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో మండల మాజీ ప్రజా ప్రతినిధులు,మండల నాయకులు, కార్యకర్తలు,అభిమానులు. తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.