ప్రతి కుటుంబానికి 125 రోజులు పనులు కల్పించాలి
మద్దూరు ఎంపిడిఓ చిలుముల శ్రీనివాస్
వి బి జి రామ్ జి క్షేత్ర సహాయకులకు శిక్షణ
మద్దూరు అక్టోబర్27, ప్రజా వాణి,
మద్దూరు మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో మంగళవారం క్షేత్ర సహాయకులకు శిక్షణ ఇచ్చినట్లు ఏ పి ఓ మంజుల ఒక ప్రకటనలో విలేఖర్లకు తెలిపారు.ఈ సందర్భంగా ఈ శిక్షణకు ముఖ్య అతిథిగా హాజరైనా ఎంపిడిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి గ్రామములో ప్రతి ఒక్క క్షేత్ర సహాయాకులు 40 మంది కూలీలతో వీబీజీరాంజి పనులు చేయించాలన్నారు.అదేవిదంగా ఎలినినో ప్రభావంతో ప్రతి కుటుంబానికి 125 రోజులు పూర్తి చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాస్ అన్ని గ్రామాల క్షేత్ర సహాయకులకు సూచించారు. ఈకార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనివాస్,ఏ పి ఒ మంజుల రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ లు రవి రమేష్ &ఫీల్డ్ అసిస్టెంట్ లు పాల్గొన్నారు.

