బద్వేల్ అక్టోబర్ 15 ప్రజావాణి నియోజకవర్గం లో ఎంపీటీసీ, జడ్పిటిసి,సర్పంచ్ అన్ని స్థానాలలో బహుజన సమాజ్ పార్టీ పోటీకి సిద్ధంగా ఉందని బద్వేల్ అసెంబ్లీ అధ్యక్షుడు చందులూరి బ్రహ్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం అంటే కేవలం కొన్ని ఇళ్లు, రోడ్లు, వీధులు మాత్రమే కాదు. మన గ్రామం మన గౌరవం! మన గ్రామం మన ఆత్మగౌరవం! మన గ్రామం మన పిల్లల భవిష్యత్తని అన్నారు.ఈరోజు మనం గ్రామపంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ మనం ఆలోచించాల్సిన అసలైన విషయం ఒక్కటే. మన గ్రామం రాబోయే ఐదేళ్లలో ఎలా ఉండాలి? మన పిల్లలకు ఎలాంటి భవిష్యత్తును అందించాలి? మన రైతుల సమస్యలను ఎలా పరిష్కరించాలి? మన గ్రామంలోని ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు ఎలా అందించాలి?ప్రజాప్రతినిధి అంటే ప్రజలపై అధికారం చెలాయించే వ్యక్తి కాదు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని,వాటి పరిష్కారం కోసం పనిచేసే బాధ్యతగల వ్యక్తిగా ఉండాలని సర్పంచ్ పదవి అంటే కేవలం ఒక కుర్చీ కాదు. అది గ్రామ ప్రజలు అప్పగించే బాధ్యత అని అన్నారు.కులం,మతం,ప్రాంతం, రాజకీయ పార్టీలు అనే భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమ న్యాయం జరిగేలా బి.ఎస్.పి పార్టీ పనిచేస్తుందని అని తెలిపారు.యువత రాజకీయాలలో రాణించడం సమాజానికి ఎంతో అవసరమని ఆయన ఆకాంక్షించారు. ఎంతో కాలం నుండి పాత్రికేయుడిగా నిరంతరం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన కలిగి వాటికి పరిష్కారం మార్గాన్ని మార్గ పరిష్కార మార్గానికి కృషి చేయడంలో తనకు ఎంతో అనుభవం ఉందని ప్రజలు తనను స్థానిక సంస్థల్లో గెలిపించి పోరుమామిళ్ల రంగసముద్రం పంచాయతీ అభివృద్ధికి కృషి చేయడానికి ఒక అవకాశం కల్పించాలని కోరారు.త్రాగునీరు,సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కార్యాచరణ,సీజనల్ వ్యాధుల కొరకు ప్రత్యేక వైద్య శిబిరాలు,ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ మరియు ఓబీసీలకు ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందేందుకు కృషి చేయడం,నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య కార్యక్రమాలు నిర్వహించడం, పంచాయతీ నిధులను పూర్తిస్థాయిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా నూతన పథకాలను అమలు చేయడం,ప్రజా సమస్యల కోసం ప్రజలకు అందుబాటులో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయడం,ప్రజల రెవెన్యూ సమస్యలపై పోరాటం,విద్యార్థుల జ్ఞానాభివృద్ధికి ఆధునిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం,చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు,గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని యోగా కేంద్రంఏర్పాటు చేస్తానన్నారు.గతంలో అభివృద్ధికి నోచుకోని ఇంకా ఎన్నో కార్యక్రమాలను నాయకుడిగా కాకుండా మీ సేవకునిగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికలలో పోటీ చేస్తున్నానని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ డబ్బు, ఒత్తిడి, ప్రలోభాలకు లోను కాకుండా యువతకు ప్రాధాన్యత ఇచ్చి తనకు ఓటు వేసి, వేయించి గెలిపించాలని ఆయన కోరారు.
బద్వేల్ నియోజకవర్గం లో అన్ని స్థానాలలో బీఎస్పీ పోటీ బద్వేల్ అసెంబ్లీ బీఎస్పీ అధ్యక్షుడు చెందులూరి బ్రహ్మయ్య
RELATED ARTICLES

